29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

బతుకమ్మ కథనానికి స్పందించిన అధికారులు…

Must read

📰 Generate e-Paper Clip

 

. . . డబ్బులు రికవరీ చేశాం

 

. . . అవకతవకలకు పాల్పడిన వారి పై చర్యలు తీసుకుంటాం

 

. . . ఐకేపి ఏపిఎం బస్వంత్

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ మండల కేంద్రంలో ని ఐకెపి కార్యాలయంలో ఓ గ్రూపులో పదిమంది గ్రూపు సభ్యులకు తెలియకుండానే, ఎలాంటి సంతకాలు లేకుండా సుమారు రెండు లక్షల రూపాయలు డ్రా చేసినట్లు బతుకమ్మ దినపత్రికలో వార్త ప్రచురితం కావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం పై ఐకేపీ ఏపిఎం బస్వంత్ మాట్లాడుతూ.. ఓ గ్రూపులో పదిమంది సభ్యులకు సమాచారం లేకుండా, సంతకాలు లేకుండా డబ్బులు డ్రా చేయడం తప్పు అని అన్నారు. బతుకమ్మ పేపర్ లో వార్త వచ్చిన తర్వాతనే నాకు కూడా ఈ విషయం తెలిసిందని, వాళ్ళ వద్ద ఉన్న రికార్డులను పరిశీలించి, డబ్బులు కూడా రికవరీ చేశామని, అవకతవకలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని ఏపిఎం అన్నారు. ఇకముందు ఇలాంటివి జరుగవని ఆయన స్పష్టం చేశారు.

More articles

Latest article