28.8 C
Hyderabad
Monday, August 3, 2026

బాన్సువాడ మాతా శిశు ఆసుపత్రిలో ఇద్దరు నర్సుల సస్పెన్షన్…

Must read

📰 Generate e-Paper Clip

 

. . . అనస్తీషియా వైద్యుడి కాంట్రాక్ట్ సేవలు రద్దు

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

బాన్సువాడ మాతా శిశు ఆసుపత్రిలో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు నర్స్లు ,అనస్తీషియా వైద్యుడిపై తెలంగాణ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. జూలై 10, 11 తేదీల్లో బాన్సువాడ మాతా శిశు ఆసుపత్రిలో ఐదుగురు మహిళలకు సిజేరియన్ శస్త్రచికిత్సలు నిర్వహించగా, అనంతరం కొందరిలో శస్త్రచికిత్స అనంతర సమస్యలు, ఇన్ఫెక్షన్లు ఏర్పడ్డాయి. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. శస్త్రచికిత్స పరికరాలు, లినెన్‌ను తగిన విధంగా స్టెరిలైజ్ చేయకపోవడం వల్ల కలుషితమయ్యే అవకాశం ఉందని, ఆపరేషన్ థియేటర్‌లో కఠినమైన శుభ్రత, స్టెరైల్ పరిస్థితులు పాటించకపోవడమే సమస్యలకు కారణం అని విచారణ కమిటీ నివేదికలో పేర్కొంది.

More articles

Latest article