27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

పోలీసుల విధులను అడ్డుకున్న పదిమంది అరెస్ట్..

Must read

📰 Generate e-Paper Clip

 

. . . భార్య భర్తల మధ్య చిన్న గొడవ

 

. . . సంఘటన స్థలంలో పోలీస్ వాహనం ధ్వంసం

 

ఇందల్వాయి, బతుకమ్మ :

 

ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని తిరుమలయ్య తండా, మెగ్య నాయక్ తండాలకు చెందిన రెండు వర్గాల మధ్య భార్యాభర్తల కుటుంబ వివాదాల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయంపై సమాచారం అందుకున్న ఇందల్వాయి ఎస్సై సుమలత పోలీసు సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను సముదాయించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా కొందరు వ్యక్తులు పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తూ పోలీసులపై దాడికి పాల్పడినట్లు ఎస్సై సుమలత తెలిపారు. పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగడంతో పాటు పోలీసు వాహనాన్ని ధ్వంసం చేసినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ ఘటనలో పలువురు పోలీసు సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయని వెల్లడించారు. ఘటనకు సంబంధించి జూలై 6న కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి మొత్తం 32 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరిలో పోలీసు వాహన ధ్వంసం, విధులకు ఆటంకం కలిగించినట్లు గుర్తించిన 10 మందిని గురువారం కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం వారిని రిమాండ్‌కు పంపినట్లు ఎస్సై తెలిపారు. మిగిలిన 22 మందిని ఇందల్వాయి తహసీల్దార్ బాలయ్య ఎదుట బైండోవర్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు పేర్కొన్నారు.

More articles

Latest article