30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

ఇందల్వాయిలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం

Must read

📰 Generate e-Paper Clip

 

ఇందల్వాయి, బతుకమ్మ :

 

కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను ఇందల్వాయి మండలానికి చెందిన బీజేపీ నాయకులు గురువారం దహనం చేశారు. ముందుగా ఇందల్వాయి ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం ఎదుట నిరసన చేపట్టి రోడ్డుపై బైఠాయించారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తా వద్ద రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ తాత్కాలిక మండల అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ ఘటనకు ప్రధాని నరేంద్ర మోదీకి ఎలాంటి సంబంధం లేదని ప్రశ్నించారు. భారతదేశాన్ని ప్రపంచ దేశాలతో సమానంగా అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై రాజకీయ కక్షతోనే కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు నాయుడు రాజన్న, మాజీ సర్పంచ్ మఠంల శేఖర్, మోహన్ రెడ్డి, ప్రస్తుత సర్పంచులు కన్నె రాజేందర్, స్టేషన్ తండ సర్పంచ్ జగత్ సింగ్ పవర్, సత్యనారాయణ, రామస్వామి, కిరణ్, మహేష్, మహేందర్, సక్కి నారాయణ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article