నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నగరంలో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో రోడ్లు, వంతెనల విస్తరణ పనులపై నూడా చైర్మన్ కేశ వేణు, నగర మేయర్ ఉమారాణి, మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ తో కలిసి క్షేత్ర స్థాయిలో బుధవారం పరిశీలించారు. నగరంలోని ప్రధాన జంక్షన్ల వద్ద ఇరుకుగా ఉన్న రోడ్లను విస్తరించడం, అలాగే ఎల్లమ్మగుట్ట నుంచి బాల హనుమాన్ వరకు వెళ్లే వంతెన నిర్మాణం, రాజీవ్ గాంధీ సర్కిల్ – 100 ఫీట్ రోడ్డులో ఉన్న వంతెన, కోటగల్లి నుంచి 100 ఫీట్ రోడ్డుకు అనుసంధానంగా నిర్మించాల్సిన వంతెనలు, నగరంలోని ఇతర ఇరుకైన వంతెనల విస్తరణకు సంబంధించిన అంశాలను వారు పరిశీలించారు. ఈ పరిశీలనలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, ఎంఐఎం అధ్యక్షుడు, కార్పొరేటర్ షకీల్, ఎల్లమ్మగుట్ట కార్పొరేటర్ లత, ఆర్ అండ్ బి డీఈ ప్రవీణ్, మున్సిపల్ ఈఈ తిరుపతి కుమార్, పబ్లిక్ హెల్త్ ఏఈ శంకర్ తదితర అధికారులు పాల్గొన్నారు.
