26.2 C
Hyderabad
Monday, August 3, 2026

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించిన అధికారులు

Must read

📰 Generate e-Paper Clip

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

బాన్సువాడ నియోజకవర్గం కొల్లూరు గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను సర్పంచ్ నాందేవ్, హౌసింగ్ ఏఈ వినీత్, పంచాయతీ కార్యదర్శి రాధిక సంయుక్తంగా పరిశీలించారు. నిర్మాణ పనుల నాణ్యత, పురోగతిని పరిశీలించి లబ్ధిదారులకు అవసరమైన సూచనలు చేశారు.ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసి, ప్రభుత్వ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ గృహ పథకాన్ని సద్వినియోగం చేసుకుని లబ్ధిదారులు త్వరగా తమ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యుడు సాయిలు పాల్గొన్నారు.

More articles

Latest article