28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

విక్రమ్-1 టెస్ట్ ఫ్లైట్ విజయం చారిత్రాత్మకం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . స్కైరూట్ ఏరోస్పేస్‌కు సీఎం అభినందనలు

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన ఆర్బిటల్-క్లాస్ ప్రయోగ వాహనం విక్రమ్-1ను విజయవంతంగా పరీక్షించిన హైదరాబాద్‌కు చెందిన స్పేస్-టెక్ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్‌ కు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. మిషన్ ఆగమన్ లో భాగంగా నిర్వహించిన విక్రమ్-1 టెస్ట్ ఫ్లైట్-1 విజయం భారత అంతరిక్ష రంగ చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టమని, తెలంగాణకు గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. స్కైరూట్ ఏరోస్పేస్ సాధించిన ఈ విజయం దేశం అంతరిక్ష సాంకేతిక రంగంలో సాధిస్తున్న పురోగతికి నిదర్శనమని ముఖ్యమంత్రి అన్నారు. భారత యువ శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, ఆవిష్కర్తల ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పే ఘనత స్కైరూట్‌కు దక్కిందని ప్రశంసించారు.

 

The success of the Vikram-1 test flight is historic.

 

ఈ ఏడాది ఏప్రిల్‌లో శంషాబాద్‌లోని జీఎంఆర్ ఏరోస్పేస్ పార్క్‌లో ఉన్న స్కైరూట్ ఏరోస్పేస్ మ్యాక్స్-క్యూ క్యాంపస్‌ను సందర్శించిన సందర్భంగా, మిషన్ ఆగమన్ ప్రయోగానికి ముందు విక్రమ్-1 ఫ్లైట్ హార్డ్‌వేర్‌ను శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రానికి తరలించే కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. విక్రమ్-1 విజయవంతమైన టెస్ట్ ఫ్లైట్ తెలంగాణను ప్రపంచ స్థాయి ఏరోస్పేస్, స్పేస్ టెక్నాలజీ కేంద్రంగా తీర్చిదిద్దే దిశలో మరో కీలక మైలురాయిగా నిలిచిందని ఆయన అన్నారు. ఈ విజయం ద్వారా ఏరోస్పేస్ ఆవిష్కరణలు, అధునాతన తయారీ రంగం, తదుపరి తరం అంతరిక్ష సాంకేతికతల అభివృద్ధికి తెలంగాణ అనువైన గమ్యస్థానంగా మరింత బలపడిందని పేర్కొన్నారు. స్కైరూట్ వంటి సంస్థల విజయాలు రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు యువతలో శాస్త్ర, సాంకేతిక రంగాలపై ఆసక్తిని పెంపొందించి, భావితర ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తినిస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.

 

The success of the Vikram-1 test flight is historic.

More articles

Latest article