27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఆన్ లైన్ బెట్టింగ్ కోసం అప్పులు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . నకిలీ ఎక్సైజ్ అధికారిగా దోపిడి

 

. . . 24 గంటల్లోనే గోల్డ్ చైన్ చోరి కేసు ఛేదన

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

ఆన్ లైన్ బెట్టింగ్ కి అలవాటు పడి అప్పుల పాలై, వాటిని తీర్చెందుకు నకిలీ ఎక్సైజ్ ఆఫీసర్ గా దోపిడిలకు పాల్పడుతున్న వ్యక్తిని బాన్సువాడ పోలీసులు పట్టుకున్నట్టు బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం బాన్సువాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ బీర్కూర్ మండలం దుర్కి గ్రామానికి చెందిన బత్తుల మునీశ్వర్ పోస్టల్ డిపార్ట్ మెంట్ లో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ గా పని చేసేవాడు. అయితే ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ కు అలవాటు పడిన మునీశ్వర్ ను అధికారులు సస్పెండ్ చేశారు. అయితే బెట్టింగ్ అలవాటును మానుకోలేక చేసిన అప్పులు తీర్చేందుకు నకిలీ ఎక్సైజ్ అధికారిగా అవతారమెత్తాడు. బాన్సువాడ పట్టణంలోని శాంతి నగర్ లో కిరాణా దుకాణం నిర్వహిస్తున్న బెజ్జారం రమేష్ ఇంటికి చేరుకున్నాడు.  ఈ నెల 15న రమేష్ ఇంటికి వెళ్లి తాను ఎక్సైజ్ శాఖ అధికారినని నమ్మించాడు. మీ కిరాణా దుకాణంలో మద్యం సీసాలు విక్రయిస్తున్నారనే సమాచారం వచ్చిందని, తనిఖీ చేయాల్సి ఉందని చెప్పి ఇంట్లోకి వెళ్లాడు. రమేష్ నీళ్లు తాగడానికి లోపలికి వెళ్లిన సమయంలో నిందితుడు వెనక నుండి దాడి చేసి అతడిని కింద పడవేశాడు. రమేష్ మెడలో ఉన్న సుమారు 2 తులాల బంగారు గొలుసును లాక్కొని పారి పోయాడు. బాధితుడి ఫిర్యాదు అందుకున్న వెంటనే బాన్సువాడ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ఓ సంఘటనా స్థలానికి చేరుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో నిందితుడిని దుర్కి గ్రామానికి చెందిన బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బత్తుల మునీశ్వర్(24), తండ్రి శివయ్య గా గుర్తించారు. విధుల నుంచి సస్పెండ్ అయిన తర్వాత కుడా బెట్టింగ్ అలవాటును కొనసాగించడానికి డబ్బు సమకూర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ నేరానికి పాల్పడినట్టు నిందితుడు విచారణలో అంగీకరించాడు. నమ్మదగిన సమాచారం మేరకు శుక్రవారం పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి దోచుకున్న సుమారు 23 గ్రాముల బంగారు గొలుసు, నేరానికి ఉపయోగించిన మోటార్ సైకిల్, మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని జ్యుడిషియల్ రిమాండ్ కి తరలించారు. ఈ కేసును 24 గంటల్లో ఛేదించిన ఇన్స్ పెక్టర్, క్రైం టీం హెడ్ కానిస్టేబుల్ సాయి కుమార్, కానిస్టేబుళ్లు పాండురంగ, సుదర్శన్ రావు, ప్రదీప్ రాజ్ లను ఉన్నతాధికారులు అభినందించారు.

More articles

Latest article