29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

కాంగ్రెస్‌లో చేరిన దగ్గి గ్రామ ఉపసర్పంచ్ తిరుపతి

Must read

📰 Generate e-Paper Clip

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ :

 

సదాశివనగర్ మండలంలోని దగ్గి గ్రామ ఉపసర్పంచ్ తిరుపతి ఎమ్మెల్యే మదన్ మోహన్ నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేస్తూ శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆయనకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే మదన్ మోహన్, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలపై విశ్వాసంతోనే ఉపసర్పంచ్ తిరుపతి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల్లో విశేష ఆదరణ లభిస్తోందని, అదే కారణంగా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పార్టీలో చేరిన ఉపసర్పంచ్ తిరుపతికి ఎమ్మెల్యే మదన్ మోహన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, గ్రామాభివృద్ధితో పాటు పార్టీ బలోపేతానికి సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

More articles

Latest article