కాంగ్రెస్‌లో చేరిన దగ్గి గ్రామ ఉపసర్పంచ్ తిరుపతి

  ఎల్లారెడ్డి, బతుకమ్మ :   సదాశివనగర్ మండలంలోని దగ్గి గ్రామ ఉపసర్పంచ్ తిరుపతి ఎమ్మెల్యే మదన్ మోహన్ నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేస్తూ శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆయనకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే మదన్ మోహన్, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలపై విశ్వాసంతోనే ఉపసర్పంచ్ తిరుపతి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు....