ఆర్మూర్, బతుకమ్మ :
ఆర్మూర్ పట్టణంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర నిర్వహించారు. గురువారం ఆర్మూర్ పట్టణంలో జరిగిన జగన్నాథ రథయాత్ర కార్యక్రమాన్ని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ లహరి, ఇస్కాన్ అధ్యక్షులు రామానంద రాయి ఆది పురుష ప్రారంభించారు. ఆర్మూర్ పట్టణ పుర వీధుల గుండా ఈ రథ యాత్ర కొనసాగింది. జై జగన్నాథ్ జై శ్రీ కృష్ణ అంటూ భక్తుల నామ స్మరణతో మారు మోగింది. ఆర్మూర్ లో తొలి సారి ఇస్కాన్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు ఆర్మూర్ చుట్టు పక్కల ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇస్కాన్ అధ్యక్షులు రామానంద రాయి ఆది పురుష మాట్లాడుతూ పూరి లో జరిగే జగన్నాథ యాత్రను విశ్వవ్యాప్తం చేయడమే లక్ష్యంగా ఇస్కాన్ ఆధ్వర్యంలో జిల్లాలో ఏడు ప్రాంతాల్లో రథయాత్రలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఆర్మూర్ లోనే తొలి జగన్నాథ రథయాత్ర నిర్వహించగా ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించిందన్నారు. హైందవ ధర్మ రక్షణ తో పాటు శ్రీ కృష్ణ తత్వాన్ని ప్రజల్లోకి తీసుకుళ్లెందుకు జగన్నాథ రథయాత్ర నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
