ఆర్మూర్ లో అట్టహాసంగా జగన్నాథ రథయాత్ర

  ఆర్మూర్, బతుకమ్మ :   ఆర్మూర్ పట్టణంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర నిర్వహించారు. గురువారం ఆర్మూర్ పట్టణంలో జరిగిన జగన్నాథ రథయాత్ర కార్యక్రమాన్ని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ లహరి, ఇస్కాన్ అధ్యక్షులు రామానంద రాయి ఆది పురుష ప్రారంభించారు. ఆర్మూర్ పట్టణ పుర వీధుల గుండా ఈ రథ యాత్ర కొనసాగింది. జై జగన్నాథ్ జై శ్రీ కృష్ణ అంటూ భక్తుల నామ స్మరణతో మారు మోగింది. ఆర్మూర్ లో తొలి సారి ఇస్కాన్ ఆధ్వర్యంలో...