బతుకమ్మ, మెండోరా: ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయని గా పేరు ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఈ సంవత్సరం జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 21 ఉదయం 6 గంటల వరకు 256.330 టిఎంసిల నీరు వచ్చి చేరింది. అలాగే ప్రాజెక్టు నుండి వరద గేట్ల ద్వారా గోదావరిలోకి, ఎస్కేప్ గేట్ల ద్వారా, కాకతీయ, సరస్వతి, లక్ష్మి, వరద కాలువల ద్వార, మిషన్ భగీరథ, ఆవిరూపంలో ఇప్పటివరకు 183.229 టిఎంసిల నీటిని వదిలినట్లు అధికారులకు గణాంక లు తెలుపుతున్నాయి. ఆదివారం రాత్రి ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పెరగడంతో 67562 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్ట్ 17 గేట్ల ద్వారా గోదావరిలోకి 53108 క్యూసెక్కుల నీటిని వదిలారు. సోమవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహం తగ్గడంతో 51942 క్యూసెక్కు ల నీరు వచ్చి చేరుతుంది. ఫలితంగా మధ్యాహ్నం మూడు గంటలకు ఐదు గేట్ల మూసివేసి ప్రస్తుతం 12 గేట్ల ద్వారా గోదావరిలోకి 37488 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది.
కాలువల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల..
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కాలువల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. కాకతీయ ద్వారా 5800 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 2200 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 500 క్యూసెక్కులు, లక్ష్మీ కాలువ ద్వారా 150 క్యూసెక్కులు, వరద కాలువ ద్వారా 5000 క్యూసెక్కులు, మిషన్ భగీరథ 231 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతోంది.
వచ్చింది 256.330.. వెళ్ళింది 183.229 టిఎంసిలు..
