26.2 C
Hyderabad
Monday, August 3, 2026

చెక్ బౌన్స్ కేసులో ఎల్ఐసి ఉద్యోగస్తుడికి ఏడాది జైలుశిక్ష

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ లీగల్, బతుకమ్మ :

 

చెక్ బౌన్స్ కేసులో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగి బానోత్ శంకర్ దాఖలు చేసిన క్రిమినల్ అప్పీలును కొట్టివేస్తు, మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు విధించిన ఏడాది జైలుశిక్షను ఖరారు చేస్తు నిజామాబాద్ సెషన్స్ జడ్జి జీవిఎన్ భారత లక్ష్మీ తీర్పు చెప్పారు. నిజామాబాద్ నగరంలోని కోటగల్లి నివాసుడైన ఆకుల లక్ష్మణ్ కోటగల్లిలోనే కృష్ణవేణి ఫైనాన్స్ పేరిట తనకు తెలిసినవారు వారి ఆర్థిక అవసరాలకోసం డబ్బులు అడిగితే ప్రామీసరి నోట్ పైన సంతకాలు తీసుకుని డబ్బులు అప్పుగా ఇచ్చేవారు.వర్ని మండల నివాసుడు, నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మ గుట్ట లో గల లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అఫ్ ఇండియాలో ఉద్యోగం చేస్తున్న బానోత్ శంకర్ తన వ్యక్తిగత ఆర్థిక అవసరాల కోసమని ఎనిమిది లక్షల డబ్బులు కావాలని అడగడంతో తనకు తెలిసినవాడు, ప్రభుత్వ ఉద్యోగి అయిన అతనికి లక్ష్మణ్  10 దిశంబర్, 2017 న ప్రామీసరి నోట్ పైన సంతకం తీసుకుని 4 లక్షల 70 వేలు నగదు ఇచ్చి మిగతా 3 లక్షల 30 వేలు బ్యాంక్ చెక్ ద్వారా ఇచ్చాడు. అప్ప్పు చెల్లించమని ఎన్నిసార్లు అడిగిన చెల్లించకుండా వాయిదాలు వేసేవాడు. అడుగగా అడుగగా 27 పిబ్రవరి, 2018 న 20 వేల వడ్డి మాత్రమే చెల్లించి పార్ట్ పేమెంట్ గా 6 లక్షలు చెల్లిస్తానంటూ హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ సిద్దిపేట బ్రాంచ్ కు చెందిన రెండు పోస్ట్ డేటెడ్ చెక్ లు 3 లక్షల చొప్పున ఒకటి 12 నవంబర్, 2018 న మరొకటి 04 దిశంబర్, 2018 చెల్లించే విదంగా ఇచ్చాడు. రెండు చెక్ లను లక్ష్మణ్ నిజామాబాద్ ప్రగతి భవన్ లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఉన్న తన బ్యాంక్ ఖాతాలో జమ చేయమని బ్యాంక్ అధికారులు సూచించిన బాక్స్ లో వేశాడు .చెక్ లను ఆన్ లైన్ ద్వారా చెక్ చేసుకున్న అధికారులు సిద్దిపేట హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ శంకర్ ఖాతాలో చెక్ లకు సరిపడిన నగదు నిల్వలు లేవని తెలుపుతు రిటర్న్ మెమోను లక్ష్మణ్ కు అందజేశారు. ఈ విషయాలను తెలుపుతు తన న్యాయవాది ద్వారా లీగల్ నోటీసులు శంకర్ కు పంపించాడు. తదుపరి నిజామాబాద్ మొదటి అదనపు జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ ప్రకారం పిర్యాదు చేశాడు.లక్ష్మణ్ వాంగ్మూలాన్ని నమోదు చేసిన కోర్టు, బ్యాంక్ చెక్ లను, రిటర్న్ మెమోను ఇతర సాక్ష్యాలను పరిగణలోకి తీసుకున్న మున్సిఫ్ మేజిస్ట్రేట్ ఖుష్భూ ఉపాధ్యాయ 10 సెప్టెంబర్, 2025 తీర్పు వెలువరించారు.10 అక్టోబర్, 2025 నుండి ఎనిమిది వాయిదాలలో లక్ష రూపాయల చొప్పున చెల్లించాలని లేకుంటే ఏడాది జైలుషిక్ష అనుభవించాలని తీర్పులో వ్రాశారు. తీర్పును సవాలు చేస్తూ శంకర్ జిల్లా సెషన్స్ కోర్టులో క్రిమినల్ అప్పీలు దాఖలు చేశాడు.అప్పీలును అందులోని డాక్యుమెంట్స్ ను అధ్యయనం చేసి ఇరు పక్షాల న్యాయవాదుల వాదనలు విన్న సెషన్స్ జడ్జి భారత లక్ష్మీ మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు తీర్పును సమర్దించింది. చెక్ లో పేర్కొన్న విదంగా డబ్బులు చెల్లించకుండా ఉన్నందున సంవత్సరం జైలశిక్ష అనుభవించాలని జడ్జి పేర్కొన్నారు. జైలుశిక్ష వారంట్ ను స్వీకరించిన పోలీసులు బానోత్ శంకర్ ను నిజామాబాద్ జిల్లా కేంద్ర కారాగారానికి తరలించారు.

More articles

Latest article