27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

రేపు ఇందూర్ రణభేరి

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ఫీజు రీయింబర్స్‌ మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా యువ మోర్చా (బిజెవైఎం) నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం “ఇందూర్ రణభేరి” కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను గురువారం బీజేపీ నిజామాబాద్ జిల్లా కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌ మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేసి, వారి విద్యకు ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని నాయకులు కోరారు. ఈ డిమాండ్‌తో చేపట్టనున్న “ఇందూర్ రణభేరి” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా, బీజేపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి గోపిడి శ్రవంతి రెడ్డి, కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

More articles

Latest article