రేపు ఇందూర్ రణభేరి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా యువ మోర్చా (బిజెవైఎం) నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం “ఇందూర్ రణభేరి” కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను గురువారం బీజేపీ నిజామాబాద్ జిల్లా కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేసి, వారి విద్యకు ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని నాయకులు కోరారు. ఈ...