27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

ఎన్యుమరేషన్ ఫారాలను త్వరితగతిన అందజేయాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా

 

మాక్లుర్, బతుకమ్మ :

 

అర్హులైన ఓటర్లందరికి బిఎల్ఓలు అందజేసిన ఎన్యుమరేషన్ ఫారాలను నింపి త్వరితగతిన బిఎల్ఓలకు అందజేయాలని సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా అన్నారు. మాక్లూర్ మండలంలోని చిన్నాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి  ఒక్కరూ తమ వివరాలను ఈ నెల 24 లోపు తప్పక సమర్పించాలని అన్నారు. ప్రతి ఒక్కరికి ఎస్ఐఆర్ పై అవగాహన కల్పించాలని బిఎల్ఓకు, తహసీల్దార్ కు  ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ శేఖర్, సర్పంచ్ పుష్పాల చిన్న గంగాధర్, పంచాయతీ కార్యదర్శి, బిఎల్ఓలు, ఐకెపి సిబ్బంది, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

More articles

Latest article