24 C
Hyderabad
Sunday, August 2, 2026

కంటైనర్ ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . డ్రైవర్ కు గాయాలు

 

భిక్కనూర్, బతుకమ్మ :

 

జాతీయ రహదారి ఎన్ హెచ్ – 44 పై బుధవారం ఆర్టీసీ లగ్జరీ నాన్ స్టాప్ బస్సు కంటైనర్ లారీని వెనుక నుంచి ఢీ కొట్టింది. భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామ శివారులో సాయిబాబా ఆలయం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కామారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కామారెడ్డి నుంచి జేబీఎస్ కు వెళ్తుండగా ముందు వెళ్తున్న కంటైనర్ లారీ డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో నియంతన కోల్పోయిన బస్సు వెనక నుంచి బలంగా ఢీ కొంది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయింది. బస్సు డ్రైవర్ బాలయ్యకు తీవ్ర గాయాలు కాగా జిఎంఆర్ అంబులెన్స్ లో కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సులోని ప్రయాణికులు సురక్షంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న భిక్కనూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బస్సుని, కంటైనర్ ని పక్కకు తరలించారు. దీంతో సుమారు 30 నిమిషాల పాటు జాతీయ రహదారిపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 

RTC bus rams into container truck

More articles

Latest article