24.7 C
Hyderabad
Monday, August 3, 2026

తెలంగాణ యూనివర్సిటీ అధ్యాపకులకు పదోన్నతులు కల్పించాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ భక్కి వెంకటయ్య

 

డిచ్‌పల్లి, బతుకమ్మ :

 

తెలంగాణ యూనివర్సిటీలో 2014లో నియమితులైన అధ్యాపకుల పదోన్నతుల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ భక్కి వెంకటయ్య సూచించారు. తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు విశ్వవిద్యాలయానికి అధికారిక పర్యటనకు వచ్చిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ భక్కి వెంకటయ్యను కలిసి అధ్యాపకుల పదోన్నతుల సమస్యపై వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా 2014లో నియమితులైన అధ్యాపకులకు పదోన్నతులు కల్పించే ప్రక్రియను పూర్తి చేయాలని వారు కోరారు. దీనిపై స్పందించిన చైర్మన్ భక్కి వెంకటయ్య, డివిజన్ బెంచ్ తుది తీర్పుకు లోబడి పదోన్నతుల ప్రక్రియను త్వరలో పూర్తి చేయాలని విశ్వవిద్యాలయ ఉపకులపతి (వీసీ), రిజిస్ట్రార్‌లకు సూచించారు. అనంతరం తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఏ. పున్నయ్య ఆధ్వర్యంలో భక్కి వెంకటయ్యను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సంపత్, డాక్టర్ సబిత, డాక్టర్ రాజేశ్వరి, డాక్టర్ హరిత, డాక్టర్ స్వప్న, డాక్టర్ ప్రతిజ్ఞ, నీలిమ, డాక్టర్ ప్రసన్న రాణి, డాక్టర్ జమీల్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article