27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

వేరే పార్టీల్లో నుంచి వచ్చిన వారికి రెండో ప్రాధాన్యత

Must read

📰 Generate e-Paper Clip

– టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: వేరే పార్టీల్లో నుంచి వచ్చిన వారికి పదవుల కేటాయింపులో రెండో ప్రాధాన్యత ఉంటుందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. నుడా చైర్మన్ గా కేశ వేణు బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో మహేశ్ కుమార్ గౌడ్ తోపాటు ఇన్ చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు. మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. అన్ని వర్గాల కృషి తోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకూ గుర్గింపు ఉంటుందన్నారు.  అభివృద్ధిలో భాగస్వామ్యు లు కావాలని, కష్టపడే వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం ఉంటుందని స్పష్టంచేశారు. కేసీఆర్ తెలంగాణను భ్రష్టుపట్టించారని, ఉద్యోగాలు ఇవ్వలేని బీజేపీ, బీఆర్ ఎస్ నేతలు రోడ్డెక్కుతారా? అని ప్రశ్నించారు.

Second preference for those from other parties

తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టండి

రాష్ర్ట ప్రభుత్వంపై కొన్ని మీడియా సంస్థల ద్వారా, సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని కాంగ్రెస్ శ్రేణులకు జిల్లా ఇన్ చార్జి మంత్రి జూపల్లి  కృష్ణారావు పిలుపునిచ్చారు. గ్రూప్ -1 పరీక్షల విషయంలో బీఆర్ ఎస్ విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నచేసిందని విమర్శించారు. అలాగే రైతు భరోసా, డబుల్ బెడ్ రూం ఇళ్ల పై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. గత పదేళ్లలో రాష్ర్ట ఆర్థిక స్థితిని అధ్వానంగా తయారు చేశారని, కేసీఆర్ హయాంలో చేసిన అప్పులకు నెలకు రూ.6వేల కోట్ల వడ్డీ చెల్లిస్తున్నామన్నారు. నియంతలా పాలించిన కేసీఆర్ కు ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటరు నమోదను ఉద్యమంలా చేపట్టి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని సూచించారు. రాష్ర్ట ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, కార్పొరేషన్ ల చైర్మన్ లు ఈర వత్రి అనిల్, మానాల మోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపతిరెడ్డి, నుడా చైర్మన్ కేశ వేణు, కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

More articles

Latest article