బతుకమ్మ, నిజామాబాద్ సిటీ : ప్రజావాణిలో నిజామాబాద్ వారసత్వ సంపద ప్రభుత్వ కమిటీని పునరుద్ధరణ చేసి జిల్లా లో పురాతన కట్టడాల పరిరక్షణ గురించి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకి విజ్ఞప్తి చేశారు. అలాగే బాల్కొండ ఖిల్లా లో ఉపాధి హామీ పథకం కింద ఉపాధి కూలీలతో ఖిల్లా లో ఉన్న ముళ్ల పొదలు తొలగించాలని కోరారు. అలాగే బాల్కొండ మండలంలోని నకాజ్ గల్లి లోని మంచినీటి కొడతా చాలా తీవ్రంగా ఉందని, నిమిషాంబ దేవి కళ్యాణ మండపం వద్ద బోరు బోరు బావి నూతనంగా వేయాలని స్థానిక ప్రజల తరఫున జిల్లా కలెక్టర్ కి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అలగొండ జిల్లా పరిరక్షణ సమితి గౌరవ అధ్యక్షులు భూసం సత్యనారాయణ, కార్యనిర్వాహక అధ్యక్షులు బి.ఆర్ నర్సింగ్ రావు సంయుక్త కార్యదర్శి డి. పవన్తదితరులు పాల్గొన్నారు.
