28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

సీఎంఆర్ పెండింగ్ లక్ష్యాలను వేగవంతంగా పూర్తి చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . సివిల్ సప్లయ్ డైరెక్టర్ శ్యాంలాల్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నిజామాబాద్ జిల్లాలో 2022 – 23కు సంబంధించి సీఎంఆర్ పెండింగ్ లక్ష్యాలను వేగవంతంగా పూర్తి చేయాలని ఆనాటి ధాన్యం వేలం విక్రయాలకు సంబంధించిన డబ్బును జమ చేయాలని సివిల్ సప్లయ్ డైరెక్టర్ శ్యాంలాల్ అన్నారు. మంగళవారం నిజామాబాద్ జిల్లాను సందర్శించి సివిల్ సప్లైస్ శాఖ అధికారులు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరింలో సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రైస్ మిల్లర్లు ఎఫ్ సిఐకి కస్టమ్ మిల్డ్ రైస్ సీఎంఆర్ సరఫరా చేస్తున్న పురోగతి, రబీ 2022 – 23 ధాన్యం వేలం విక్రయాల ఆదాయం జమ చేయడం, ఎఫ్ సిఐ గోదాముల్లో ఖాళీ నిల్వ స్థలం లభ్యత, ఎఫ్ సిఐకి సీఎంఆర్ సరఫరా చేయడంలో మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏవైనా సమస్యలు ఉంటే సీఎంఆర్ సరఫరాలను వేగవంతం చేసి, పెండింగ్ లక్ష్యాలను సమయానికి పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు. సీఎంఆర్ సరఫరాలను సమీపంగా పర్యవేక్షించాలని, ఎఫ్ సిఐ, మిల్లర్లతో సమన్వయం చేసుకుని అడ్డంకులను పరిష్కరించాలని, వేలం మొత్తాలను వెంటనే జమ చేయించాలని, అలాగే కస్టమ్ మిల్లింగ్ కార్యకలాపాలు సజావుగా, సమయానికి పూర్తయ్యేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ అన్ని సివిల్ సప్లైస్ ఫీల్డ్ అధికారులకు సూచించారు.

More articles

Latest article