27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

జీజీహెచ్ సూపరింటెండెంట్ గా డా.రాములు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగిస్తూ డీఎంఈ ఉత్తర్వులు

 

నిజామాబాద్, బతుకమ్మ :

 

నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా అర్థోపెడిక్ విభాగం అధిపతి ప్రొ.డా.ఎల్.రాములును నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మొన్నటి వరకు పని చేసిన శ్రీనివాస్ స్థానంలో రాములు ఇంచార్జిగా వ్యవహరించిన విషయం తెల్సిందే. ఇటీవల జరిగిన బదిలీల్లో సీనియర్ ఫ్రొఫెసర్లు ఎవరిని కూడా కేటాయించకపోవడంతో ఇంచార్జిగా ప్రొ.రాములుకే పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. దాదాపు దశాబ్ధ కాలంగా నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి రెగ్యులర్ సూపరిండెంటెండ్ గా నియామకాలు జరుగడం లేదు. ప్రస్తుతం ఇంచార్జి సూపరింటెండెంట్ గా పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించిన డా.రాములు గతంలోనూ 2017, 18, 19లో సూపరింటెండెంట్ గా పని చేసిన అనుభవం ఉంది. ఇటీవల కాలంలో ప్రొఫెసర్లు బదిలీ అయిన తర్వాత పూర్తి బాధ్యతలను అప్పగించేందుకు డిఎంఈ ఆసక్తి కలిగిన ప్రొఫెసర్ల జాబితా కోరింది. ఎవరు కూడా ముందుకు రాకపోవడంతో ఇంచార్జిగా ఉన్న రాములుకే పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మంగళవారం డా.రాములు పూర్తి బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు ఆసుపత్రి అధికారులతో పాటు మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్ కృష్ణమోహన్, ఏడి సునీత, మెడికల్ కాలేజి సూపరింటెండెంట్ పెద్దోళ్ళ నాగరాజు లు స్వాగతం పలికారు. ఆగస్టు మాసంలో పదోన్నతుల సమయంలో జీజీహెచ్ కు సూపరింటెండెంట్ ను నియమించే అవకాశమున్నట్టు తెలిసింది.

 

Dr. Ramulu as GGH Superintendent

More articles

Latest article