27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ఈగల్ ఫోర్స్, రాచకొండ నార్కోటిక్స్ పోలీసుల సంయుక్త ఆపరేషన్

Must read

📰 Generate e-Paper Clip

 

. . . 41.01 కిలోల గంజాయి స్వాధీనం

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

విశ్వసనీయ సమాచారం మేరకు తెలంగాణ ఈగల్ ఫోర్స్, రాచకొండ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్ బృందం సంయుక్తంగా నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మహావీర్ హరీణ వనస్థలి నేషనల్ పార్క్ సమీపంలోని ఆటోనగర్ ప్రాంతంలో, ఖమ్మం ఆర్‌ఎన్‌సీసీ ఈగల్ ఫోర్స్ బృందం సహకారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా బాబా భోళోనాథ్ బస్సును తనిఖీ చేయగా, అందులో అక్రమంగా తరలిస్తున్న 41.01 కిలోల గంజాయిను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.20.5 లక్షలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. నిందితులపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయని, ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

More articles

Latest article