28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

లయన్స్ క్లబ్, దాత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్త దాన శిబిరం

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్, బతుకమ్మ :

 

లయన్స్ క్లబ్ రుద్రూర్, దాత్రి శ్రీ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నిజామాబాద్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకు వారి సహకారముతో రుద్రూర్ లోని శశిరేఖ ఫంక్షన్ హాల్ లో శుక్రవారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రుద్రూర్ పోలీస్ స్టేషన్ ఎస్సై మనోజ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇందులో రక్త దాతల ద్వారా 28 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఎస్సై మనోజ్ కుమార్ మాట్లాడుతూ.. రక్తాన్ని దానం చేయడం ఒక మహాత్తరమైన సేవ అని, ఒక యూనిట్ రక్తంతో ఇద్దరి ప్రాణాలను కాపాడవచ్చునని పేర్కొన్నారు. ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన లయన్స్ క్లబ్ రుద్రూర్, దాత్రి శ్రీ ఫౌండేషన్ వారికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ రక్త దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు.  ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ గుండూరు ప్రశాంత్ గౌడ్, దాత్రిశ్రీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు గాండ్ల మధు, క్లబ్ కార్యదర్శి లయన్ గెంటిల గంగాధర్, కోశాధికారి లయన్ పార్వతి ప్రశాంత్, జిల్లా అధ్యక్షులు లయన్ కెవి మోహన్, రాష్ట్ర జియెష్టి కో ఆర్డినేటర్ లయన్ శ్యామ్ సుందర్ పహాడే, సీనియర్ సభ్యులు లయన్స్ నాగరాజు లోగం, శివ సాయి ప్రసాద్, డైరెక్టర్స్ పుట్టి సాగర్, పుట్టి సందీప్, ఒరికే సతీష్, నాన్ లయన్స్ సభ్యులు సాయి కుమార్, సునీల్, శ్రవణ్, వినయ్, రెడ్ క్రాస్ సభ్యులు గంగాధర్, వైద్య సిబ్బంది, రక్తదాతలు తదితరులు పాల్గొన్నారు.

 

Blood donation camp organized by Lions Club and Dhatri Foundation.

More articles

Latest article