25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

ఫ్రైడే – డ్రైడేతో వ్యాధులను నివారిద్దాం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . వార్డ్ ప్రజలకు అవగాహన కల్పించిన మున్సిపల్ కమీషనర్

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

బాన్సువాడ మున్సిపాలిటీ 13వ వార్డు టీచర్ కాలనీలో శుక్రవారం ఫ్రైడే – డ్రైడే కార్యక్రమం నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమీషనర్ గోవు గంగాధర్ మాట్లాడుతూ వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను నివారించేందుకు ప్రతి శుక్రవారం ఫ్రైడే – డ్రై డే కార్యక్రమాన్ని తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఇళ్లలో, ఇంటి పరిసరాల్లో, కూలర్లు, డ్రమ్‌లు, కుండీలు, పాత టైర్లు, కొబ్బరి చిప్పలు వంటి వాటిలో నిల్వ ఉన్న నీటిని వెంటనే తొలగించాలని కోరారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా దోమల వ్యాప్తిని నివారించవచ్చని తెలిపారు. ప్రజలందరూ మున్సిపల్ సిబ్బందికి సహకరించి తమ ఇళ్లు, కాలనీలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు కౌన్సిలర్ ఖలేఖ్, కోఆప్షన్ సభ్యులు ఖామర్ సుల్తానా గౌస్ పాషా ,కాలనీ వాసులు పాల్గొన్నారు.

More articles

Latest article