30.9 C
Hyderabad
Monday, August 3, 2026

సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ చిత్రపటాలకు పాలాభిషేకం

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

రైతు భరోసా పథకం కింద మొత్తం 124.85 లక్షల ఎకరాలకు సంబందించిన 68.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో 7,490.72 కోట్లను ప్రభుత్వం జమ చేసిన సందర్బంగా బుధవారం సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ చిత్ర పటాలకు పాలాభిషేకం నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాట్ పల్లి నగేష్ రెడ్డి ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

. . . దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి నివాళి

అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్బంగా కాట్ పల్లి నగేష్ రెడ్డి, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో వారి చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా నగేష్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్రానికి ఎనలేని సేవా చేసారని, ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అందించిన మహానుభావులని కొనియాడారు. ఈ కార్యక్రమాలలో నిజామాబాద్ కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, డిసిసి కోశాధికారి భక్తవస్తలం, డిసిసి ఉపాధ్యక్షులు రత్నాకర్ గౌడ్, గాదరి గోపి, పాషా, రజిత యాదవ్, ముస్కు వెంకట రెడ్డి, అమృతాపూర్ గంగాధర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

 

Milk poured over the portraits of CM Revanth Reddy and PCC President Mahesh Goud.

More articles

Latest article