30.9 C
Hyderabad
Monday, August 3, 2026

ఫరిద్ పేట్ సర్పంచ్ నర్సింహరెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన వార్డు సభ్యులు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . రూ.4 లక్షల అవినీతికి పాల్పడ్డారని పంచాయతీ కార్యాలయం ముందు నిరసన

. . . సర్పంచ్  పదవి నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్

 కామారెడ్డి, బతుకమ్మ:

పరిధ్ పేట గ్రామ సర్పంచ్ జీడిపల్లి నరసింహారెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు వార్డు మెంబర్స్, ప్రజలు. కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం పరిధ్ పేట గ్రామంలో సర్పంచ్ జీడిపల్లి నరసింహారెడ్డి ఓకే పనికి రెండుసార్లు బిల్లులు డ్రా చేసి 4 లక్షల అవినీతికి పాల్పడ్డారని గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు వార్డు మెంబర్ గ్రామ కొంతమంది ప్రజలు సర్పంచ్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దీపక్ వార్డు సభ్యులు నర్సింలు , రమాదేవి మాట్లాడుతూ పరిధి పేట గ్రామ సర్పంచ్ జీడిపల్లి నరసింహారెడ్డి 4 లక్షల రూపాయలు అవినీతికి పాల్పడ్డ సర్పంచ్ జీడిపల్లి నరసింహారెడ్డి నీ వెంటనే సస్పెండ్ చేసి అతని చెక్ పవర్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు, అవసరమైతే అతని పదవిని వెంటనే రద్దు చేసి పరిద్ పేట  గ్రామంలో మళ్లీ సర్పంచ్ ఎలక్షన్  పెట్టాలని  అధికారులను జిల్లా కలెక్టర్ ను కోరారు. సర్పంచ్ అవినీతికి సహకరించిన అధికారుల పైన కూడా వెంటనే చర్యలు తీసుకొని వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇలాంటి అవినీతికి పాల్పడుతున్న గ్రామ సర్పంచ్ నరసింహారెడ్డి పైన చర్యలు తీసుకోకపోతే గ్రామ ప్రజలు తిరగబడే పరిస్థితి ఏర్పడిందని అన్నారు.

Ward members burned the effigy of Faridpet Sarpanch Narsimha Reddy

 

More articles

Latest article