29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

అంధకార . . . ఇందూరం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . చీకటిలో నిజామాబాద్

 

. . . వీధి దీపాలు వెలుగక ప్రజలకు ఇక్కట్లు

 

. . . బైపాస్ రోడ్డులో వీధి దీపాలు ఏర్పాటు చేసేదెప్పుడో

 

. . . ప్రైవేట్ సంస్థ బకాయిలు చెల్లించలేక అంధకారంలో ప్రజలు

 

. . . కొత్త టెండర్లు ఎప్పుడు పిలిచెనో

 

నిజామాబాద్, బతుకమ్మ :

 

నిజామాబాద్ నగరం అంధకారంలో మగ్గిపోతుంది. రాష్ట్రంలో అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ లలో ఒకటైన నిజామాబాద్ నగరంలో వీధి దీపాలు వెలుగడం లేదు. గత ప్రభుత్వ హయంలో ప్రైవేట్ సంస్థకు వీధి దీపాల నిర్వాహణ బాధ్యతలు అప్పజెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సంస్థ ఈ వ్యవహరాన్ని పర్యవేక్షించేది. దాదాపు రెండు సంవత్సరాల క్రితం సంబంధిత సంస్థ కాంట్రాక్ట్ గడువు ముగిసిన కొత్తగా టెండర్లు పిలువలేదు. ఏడాది కాలంగా పాలకవర్గం లేకపోవడం ఒక ఎత్తయితే, గతంలో వీధి దీపాలను నిర్వహించిన సంస్థకు చెల్లించాల్సిన బకాయిలు ఉండడంతో ఈ విషయాన్ని ఎవరు పట్టించుకోలేదు. దాని కారణంగా వీధులన్ని అంధకారంలో ఉన్నాయి. ప్రధానమైన రహదారి వెంట ఉండాల్సిన ఎల్ ఈడి, హైమాస్ లైట్ల వెలుగులు కనిపించడం లేదు.

 

Darkness . . . Deepest gloom

 

దాదాపు 60 డివిజన్ లకు విస్తరించిన నిజామాబాద్ నగరం అమృత్ సిటీగా నామకరణం చేసి కేంద్రం ఇచ్చే గ్రాంట్స్ తోనే పలు అభివృద్ది కార్యక్రమాలు జరిగాయి. ప్రధానంగా తాగునీటి, యూజీడీ పనులకు కూడా కేంద్రం ఇచ్చే నిధులు వచ్చాయి. ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి బల్ధియాలకు నిధులు రాకపోవడంతో ప్రజలు చెల్లించే టాక్స్ లు కేవలం వేతనాలకే సరిపోతున్నాయి. దాంతో విద్యుత్ వెలుగులు నింపేందుకు నిధుల లేమి కనబడుతుంది. కొత్తగా పాలకవర్గం ఏర్పడి దాదాపు నాలుగు నెలలు గడిచినా ఇంత వరకు ఈ విషయంపై చొరవ తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. గత నెలలో జరిగిన మున్సిపల్ కౌన్సిల్ తొలి సమావేశంలోనూ ఈ అంశంపై చర్చించినట్లు గానీ దాని కోసం ప్రత్యేక నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి తీర్మానం పంపినట్లు దాఖలాలు లేవు. గతంలో ఎల్ఆర్ఎస్ కింద జమ అయిన డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలోకి మరల్చినప్పుడు కూడా ప్రైవేట్ సంస్థ బకాయిలను గుర్తు చేయలేదని సమాచారం. దాదాపు మూడు కోట్ల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉండగా కొత్త టెండర్లను పిలిచేందుకు పాలకవర్గం కానీ అధికారులు గానీ చొరవ చూపలేదు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారుల వెంట ఎల్ఈడి, హైమాస్ లైట్ల వెలుగులు లేక ఇందూర్ మెజర్ గ్రామ పంచాయితీని తలపిస్తుంది.

 

Darkness . . . Deepest gloom

 

నిజామాబాద్ నగరం అభివృద్ది చెందుతుందని చెబుతున్న పాలకులు విద్యుత్ వీధి దీపాలు వెలుగులు లేకపోయిన స్పందించడం లేదని సామాన్యులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని ప్రధాన వీధుల మీదుగా ఉండాల్సిన ఎల్ఈడి లైట్లకు తోడు గల్లీలలోనూ స్తంబాలకు విద్యుత్ దీపాలు కాలిపోయిన కొత్త వాటిని అమర్చడం లేదని విమర్శలున్నాయి. పలు కాలనీలో కరెంట్ విద్యుత్ దీపాలు లేక ఇళ్లలోనే విద్యుత్ దీపాలతోనే కాలం నెట్టుకొచ్చే పరిస్థితి నెలకొంది. ఇక నగర శివారులోని బైపాస్ లో విద్యుత్ దీపాలు లేక రోడ్లన్నీ అంధకారంలోనే ఉన్నాయి. కేవలం కంఠేశ్వర్ చౌరస్తా నుంచి అర్సపల్లి వరకే సెంటర్ మీడియం లైట్లు ఏర్పాటు వ్యవస్థ ఉంది. కంఠేశ్వర్ నుంచి మాదవనగర్ వరకు వీధి దీపాలు ఏర్పాటు చేయకపోవడంతో వాహనాల వెలుగులోనే వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని ప్రజల డిమాండ్ పెరుగుతుంది.

 

Darkness . . . Deepest gloom

More articles

Latest article