30.9 C
Hyderabad
Monday, August 3, 2026

పేకాట స్థావరంపై చీతా ఫోర్స్ మెరుపు దాడి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . 10 మంది అరెస్ట్

 

. . . రూ.58,490 నగదు, 10 సెల్‌ఫోన్లు, 5 మోటార్‌సైకిళ్లు స్వాధీనం

 

నందిపేట్, బతుకమ్మ :

 

నందిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నూత్ పల్లి గ్రామంలో పేకాట స్థావరంపై చీతా ఫోర్స్ మెరుపు దాడి నిర్వహించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు ఏసీపీ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో చీతా ఫోర్స్ బృందం చట్టవ్యతిరేక కార్యకలాపాల నిర్మూలనలో భాగంగా శనివారం నందిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నూత్‌పల్లి గ్రామం సమీపంలోని ఓ గెస్ట్ హౌస్‌పై విశ్వసనీయ సమాచారంతో ఆకస్మిక దాడి నిర్వహించింది. ఈ దాడిలో గెస్ట్ హౌస్‌లో పేకాట ఆడుతున్న 10 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.58,490 నగదు, 10 సెల్‌ఫోన్లు, 5 మోటార్‌సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నేరస్తులు, స్వాధీనం చేసుకున్న నగదు, సెల్‌ఫోన్లు, వాహనాలను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం నందిపేట్ పోలీస్ స్టేషన్ ఎస్‌.హెచ్‌.ఓ కు అప్పగించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ, నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పేకాట, జూదం, గుట్కా, మత్తు పదార్థాల విక్రయాలు, ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని తెలిపారు. ప్రజలు ఇటువంటి అక్రమ కార్యకలాపాల గురించి సమాచారం ఉంటే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా పోలీస్ శాఖకు తెలియజేయాలని, సమాచారం అందించిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని పేర్కొన్నారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై ఎలాంటి రాజీ లేకుండా కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు.

More articles

Latest article