23.3 C
Hyderabad
Saturday, August 1, 2026

ఉత్కంఠ భరితముగా రిపుల్స్ కేబినెట్ ఎన్నికలు

Must read

📰 Generate e-Paper Clip

 

బిచ్కుంద, బతుకమ్మ :

 

విద్యారంగంలో ఎప్పటికపుడు నూతన ఒరవడికి శ్రీకారం చుట్టే విద్యా వేత్త అనీల్ కుమార్ సారధ్యంలో నూతన విద్యా సంవత్సరము 2026-2027 లో కొత్త హంగులు, కొత్త విద్యార్థులతో రిపుల్స్ పాఠశాల కొత్తపుంతలు తొక్కుతూ విద్యార్థుల ఆశలకు ప్రాణం పోసి ముందుకు సాగుతున్నది.

 

Ripples Cabinet elections full of suspense

 

ఈ క్రమంలో పాఠశాలలో కేబినెట్ ఎలక్షన్లలో భాగంగా ఈ విద్యా సంవత్సరము విద్యార్థుల కేబినెట్ ఎలక్షన్స్ కి రంగం సిద్ధము చేసుకొని ఎన్నికలు నిర్వహించారు. స్కూల్ హెడ్ బాయ్, హెడ్ గర్ల్ తదితర స్థానాలకు ఆయా విద్యార్థులు పోటీలో నిలిచారు. పోటీలలో ఉన్నవారితో పాటు విద్యార్థులు, ఉపాధ్యాయులు వారి విలువైన ఓటును వినియోగించుకొని ప్రజాస్వామ్య విలువలను ప్రయోగాత్మకంగా పిల్లలకు, తల్లిదండ్రులకు తెలియజేశారు.

 

Ripples Cabinet elections full of suspense

 

ఈ ఎన్నికల్లో స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ శ్యామల గౌరవ అతిథిగా తన మొదటి ఓటును వినియోగించుకొని ఓటు అంటే విలువైన జీవితానికి కొత్త బాట అని చాటి చెప్పారు. ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలరాజు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ గా ఎన్నికల సరళిని పర్యవేక్షించగా, రిటర్నింగ్ అధికారిగా రాహుల్, ఉపాధ్యాయులు విధులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శ్యామల తో పాటు రిపల్స్ పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

 

Ripples Cabinet elections full of suspense

More articles

Latest article