29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

జగిత్యాల కేంద్రీయ విద్యాలయ నికి 10 ఎకరాల భూమి కేటాయించాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . సీఎం రేవంత్ రెడ్డి ఎంపీ ధర్మపురి అర్వింద్ లేఖ

నిజామాబాద్ , బతుకమ్మ:

జగిత్యాలలో ఏర్పాటు కానున్న కేంద్రీయ విద్యాలయానికి తెలంగాణ ప్రభుత్వం 5 ఎకరాల భూమిని కేటాయించడం స్వాగతించదగ్గ నిర్ణయమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని భూ కేటాయింపులు 10 ఎకరాలకు పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి లేఖ రాశారు. కేంద్రీయ విద్యాలయం సంఘం ( కేవి) నిబంధనల ప్రకారం 5 ఎకరాలు కనీస అవసరం కాగా, మెట్రో నగరాల వెలుపల ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో 10 ఎకరాలు అనువైన ప్రమాణమని ఆయన పేర్కొన్నారు. అదనపు భూమి ఉంటే విశాలమైన తరగతి గదులు, ప్రయోగశాలలు, క్రీడా మైదానాలు, భవిష్యత్తు విస్తరణకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించే అవకాశం ఉంటుందని వివరించారు. జగిత్యాల జిల్లా విద్యార్థులకు నాణ్యమైన విద్య వాతావరణం అందించాలనే ఉద్దేశంతో గతంలో 10 ఎకరాల భూమి కేటాయించాలని కోరిన విషయాన్ని గుర్తు చేసిన ఎంపీ అర్వింద్ . విద్యార్థుల దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పున పరిశీలించి భూ కేటాయింపులు 10 ఎకరాలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు.

More articles

Latest article