25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

రెంజల్ మాడల్ స్కూల్ లో విచారణ

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన అధికారులు

 

నిజామాబాద్, బతుకమ్మ :

 

నిజామాబాద్ రెంజల్ మండల ఆదర్శ పాఠశాలలో అవినీతి, అక్రమాలపై వేదింపులపై ప్రజావాణిలో ఫిర్యాదుతో అదనపు కలెక్టర్ భుజంగరావు విచారణ చేపట్టారు. మాడల్ స్కూల్ లో పని చేస్తున్న అధికారులపై ఇటీవల కాలంలో ఫిర్యాదులు రావడంతో విచారణ జరిపినట్లు తెలిసింది. ఈ నెల 1, 2వ తేదిల్లో పాఠశాలల్లో అధికారులు స్వయంగా విచారణ జరుపడం విశేషం. ఆదర్శ పాఠశాలలో అధికారి అజామాయిషి పెరిగిందని తోటి ఉపాధ్యాయులను వేదిస్తున్నారని ఆరోపణలు కూడా లేకపోలేదు. మధ్యాహ్న భోజనం విషయంలో ఆరోపణలు రాగా అందుకు సంబంధించిన స్టాక్ వివరాలతో పాటు రోజు ఎంత మందికి మిడ్ డే మిల్స్ అందజేస్తున్నారనే వివరాలను సేకరించనట్లు సమాచారం. గత కొన్ని రోజులుగా జరుగుతున్న వేదింపుల వ్యవహరం ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో బహిర్గతమయ్యాయి. ఈ వ్యవహరంలో విచారణ జరుగగా విద్యాశాఖలో చర్చనీయాంశంగా మారింది. రెండు రోజుల పాటు జరిగిన విచారణ నివేదికను జిల్లా కలెక్టర్ కు అందజేసినట్లు తెలిసింది. విచారణ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. రెంజల్ మాడల్ స్కూల్ లో అధికారి వ్యక్తిగత వ్యవహర శైలితో పాటు ఉపాధ్యాయుల మధ్య విభేదాలు కూడా ఉన్నట్లు చర్చ జరుగుతుంది.

More articles

Latest article