25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

క్రిమినల్ అప్పీల్ల కొట్టివేత

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఇద్దరికి జైలు శిక్షల నిర్దారణ

 

నిజామాబాద్ లీగల్, బతుకమ్మ :

 

దిగువ కోర్టులో జైలు శిక్షలకు గురైన ఇద్దరు ముద్దాయిలు దాఖలు చేసిన మూడు క్రిమినల్ అప్పీళ్లను కొట్టివేస్తు, శిక్షలను నిర్దారిస్తూ నిజామాబాద్ సెషన్స్ జడ్జి జీవిఎన్ భారత లక్ష్మీ బుధవారం తీర్పు చెప్పారని సెషన్స్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ధర్పల్లి రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ఆయన వివరించిన వివరాలు నిజామాబాద్ జిల్లా గుత్ప గ్రామానికి చెందిన పుట్ట నాగరాజు, ఆలూర్ గ్రామానికి నివాసుడు చెంచు పుట్ట నరేష్ లపై ఆర్మూర్, బాల్కొండ, ముప్కాల్ పోలీస్ స్టేషన్లలో మూడు దొంగతనం కేసులు నమోదు ఉండినవి. అవి ఆర్మూర్ జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో నేర విచారణ జరిగింది. ముద్దాయిలపై నేర నిరూపణ కావడంతో ఇద్దరికి ఒక సంవత్సరం చొప్పున జైలుశిక్షలు విదిస్తూ ఆర్మూర్ జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ నెల్లి సరళ రాణి 2025 నవంబర్, 6 న తీర్పు వెలువరించారు. సదరు జైలు శిక్షలను సవాలు చేస్తూ వారు జిల్లా సెషన్స్ కోర్టులో మూడు అప్పీళ్ళు దాఖలు చేశారు. ఆర్మూర్ మున్సిఫ్ కోర్టు వెలువరించిన తీర్పులు అధ్యయనం చేసిన సెషన్స్ కోర్టు జైలుశిక్షలకు గురైన నాగరాజు, నరేష్ లు ఫతేపూర్ గ్రామ శివారులోని చేగంటి గంగారామ్ వ్యవసాయ పొలంలోని బోరు బావి మోటారు వైర్లను 24 మే, 2025 న దొంగలించారని,26 మే, 2025 న వేంపల్లి గ్రామ శివారులో ఆరెపల్లి ప్రతాప్ వ్యవసాయ భూమిలోని బోర్ బావి వైర్లను, మరుసటి రోజు 27 మే, 2025 న రాత్రి బోదేపల్లి గ్రామంలో కూడా నాగులపల్లి దేవేందర్ వ్యవసాయ పొలంలోని బోర్ బావి వైర్లను దొంగలించారనే నేర ఆరోపణలు సాక్ష్యాధారాల ప్రకారమే ఆర్మూర్ మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు నిర్దారించి జైలుశిక్షలు విధించిందని  సెషన్స్ కోర్టు పేర్కొన్నది. ఆర్మూర్ కోర్టు తీర్పు సక్రమేనని పేర్కొంటూ అప్పీళ్లను కొట్టివేస్తు జైలుశిక్షలను ఖారారు చేసినట్లు పిపి రాజేష్వర్ తెలిపారు.

More articles

Latest article