24.1 C
Hyderabad
Monday, August 3, 2026

జూలై 2 నుంచి లింగాపూర్ బ్రిడ్జి 25 రోజుల పాటు మూసివేత

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ​ఇందల్వాయి నుంచి ధర్పల్లి వెళ్లే ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలి

 

. . . ​మరమ్మతు పనుల నేపథ్యంలో సివిల్ కాంట్రాక్టర్ వెల్లడి

 

​ఇందల్వాయి, బతుకమ్మ :

 

ఇందల్వాయి మండలం పరిధిలోని లింగాపూర్ బ్రిడ్జి కి అత్యవసర మరమ్మతులు నిర్వహించాల్సి ఉన్నందున, గురువారం (జూలై 2) నుండి 25 రోజుల పాటు బ్రిడ్జిపై వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు సివిల్ కాంట్రాక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. లింగాపూర్ బ్రిడ్జి మూసివేత కారణంగా ఇందల్వాయి నుండి ధర్పల్లి వైపు వెళ్లే వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. ప్రయాణికులు రాంపూర్ లోలం, ఎల్లారెడ్డిపల్లి గ్రామాల మీదుగా ధర్పల్లికి చేరుకోవాలని కోరారు.

​సహకరించాలని విజ్ఞప్తి :

బ్రిడ్జి మరమ్మతు పనులు వేగంగా పూర్తి కావడానికి వాహనదారులు, స్థానిక ప్రజలు సహకరించాలని, నియోజకవర్గ, మండల ప్రయాణికులు ఈ తాత్కాలిక మార్పును గమనించి తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని కాంట్రాక్టర, స్థానిక యంత్రాంగం విజ్ఞప్తి చేసింది.

More articles

Latest article