28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

నూతన ఎక్సైజ్ సూపరిండెంట్‌ను కలిసిన జై గౌడ్ నాయకులు

Must read

📰 Generate e-Paper Clip

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

జిల్లా నూతన ఎక్సైజ్ సూపరిండెంట్‌గా బాధ్యతలు చేపట్టిన ముకుంద రెడ్డిని జిల్లా జై గౌడ్ ఉద్యమం నాయకులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యమం జిల్లా అధ్యక్షుడు రంగోల మురళీధర్ గౌడ్, ఉపాధ్యక్షుడు కర్రోల శేఖర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి అంకన్నగారి శ్రీనివాస్ గౌడ్ శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా మురళి గౌడ్ జిల్లాలో జై గౌడ్ ఉద్యమం తరపున నిర్వహించిన సేవా కార్యక్రమాలను సూపరిండెంట్‌కు వివరించారు. అనంతరం ముకుంద రెడ్డి మాట్లాడుతూ, గౌడ సామాజిక వర్గం సంప్రదాయ వృత్తితో పాటు సమాజాభివృద్ధిలోనూ విశేష పాత్ర పోషిస్తోందన్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఎక్సైజ్ శాఖ సేవలను ప్రజలకు సమర్థవంతంగా అందించేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. గౌడ సంఘాల ప్రతినిధులు నిర్మాణాత్మకంగా చేసే సూచనలను సానుకూలంగా పరిశీలిస్తూ పరస్పర సహకారంతో ముందుకు సాగుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ సుందర్ సింగ్, జిల్లా జై గౌడ్ ఉద్యమం బాధ్యులు నర్సగౌడ్, నాయకులు పాల్గొన్నారు.

More articles

Latest article