28.8 C
Hyderabad
Monday, August 3, 2026

న్యాయవాదుల సంక్షేమ నిధికి 500 కోట్లు కేటాయించడానికి తోడ్పడండి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీకి “బార్ “వినతి

 

నిజామాబాద్ లీగల్, బతుకమ్మ :

 

న్యాయవాదుల సంక్షేమ నిధికి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో 500 కోట్లు కేటాయించే విదంగా విధానపరమైన నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వానికి సూచించాలని నిజామాబాద్ బార్ అసోసియేషన్ సభ్యులు కోరారు. తెలంగాణ మలిదశ ఉద్యమకాలంలో రాజీలేని పోరాటం చేశారనే చరిత్రత్మాక నేపధ్యాన్ని వినతిపత్రం రూపంలో నిజామాబాద్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నల్ల సుభాష్ రెడ్డి సీనియర్ న్యాయవాది టి జె ఎసి కన్వీనర్ గోపాల్ శర్మ, శ్రీహరి ఆచార్య, బిర్లా రామారావు, న్యాయవాదులు ఆశా నారాయణ, అన్వేష్, పులి జైపాల్, పిల్లి శ్రీకాంత్ లతో కలిసి తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల గుర్తింపు కమిటీకి తెలియజేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్లో శనివారం నిర్వహించిన సమావేశంలో కమిటీ సభ్యులు శాసన మండలి సభ్యులు ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్ లకు వినతి పత్రాన్ని అందజేశారు. టెన్యూర్ ప్రభుత్వ ప్లీడర్లు, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్స్, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ నియమకాలలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించిన న్యాయవాదులకు ప్రధాన్యం ఇవ్వాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంలో ప్రముఖులను సన్మానించే క్రమంలో న్యాయవాదులను విస్మరించరాదనీ పేర్కొన్నారు.

More articles

Latest article