28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ప్రతి ఒక్కరూ సర్ ప్రక్రియలో పాల్గొనాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ప్రతి ఒక్కరూ సర్ ప్రక్రియలో పాల్గొనాలని నిజామాబాద్ అర్బన్ల ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ సూచించారు. సర్ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా గురువారం ఎన్యుమరేషన్ పత్రాలను సంబంధిత బిఎల్ఓ సునీత అర్బన్ ఎమ్మెల్యే కు, కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సంబంధిత బిఎల్వోలు ప్రతి ఇంటికి చేరుకొని పత్రాలను అందజేస్తారని, వాటిని పూరించి తిరిగి అధికారులకు అందజేయాలని చెప్పారు. 20 ఏళ్ల క్రితం సర్ జరిగిందని, మళ్లీ జరుగుతున్న ప్రక్రియలో ప్రతి ఒక్కరు పాల్గొని ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు కలిగి ఉండాలన్నారు. ప్రతి ఇంటికి బిఎల్వోలు వచ్చే విధంగా కార్పొరేటర్లు చూడాలన్నారు. అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఎన్యుమరేషన్ పత్రాలు అందరికీ అందేలా చూడాలన్నారు.

 

Everyone must participate in the survey process.

More articles

Latest article