నిజామాబాద్ లీగల్, బతుకమ్మ :
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇంచార్జీ డైరెక్టర్ అఫ్ ప్రాసిక్యూషన్ మహ్మద్ రహీమోద్దీన్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ భూసారపు రాజేష్ గౌడ్, సతీష్, రాహుల్ లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ను ఆయన కార్యాలయంలో గురువారం మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వారితో మాట్లాడుతూ వివిధ పోలీస్ స్టేషన్ల నేర విచారణ అధికారులు కోర్టులకు సమర్పించే నేర అభియోగ పత్రాలను న్యాయమూర్తులు స్వీకరించే క్రమంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ల సహకారం చాలా అవసరమని అన్నారు. కోర్టులలో నేర న్యాయ విచారణ జరిగే సమయంలో సాక్షులకు బ్రీఫ్ ఇపించడంలో కూడా కోర్టు కానిస్టేబుల్ లకు తగిన సలహాలు, సూచనలు అందజేయాలని ఆయన సూచించారు. పోలీసులు, ప్రాసిక్యూటర్స్ కవల పిల్లలలాంటి వారని వేరువేరుగా చూడలేమని డిప్యూటీ డైరెక్టర్ అఫ్ ప్రాసిక్యూషన్ మహమ్మద్ రహీమోద్దీన్ అన్నారు. క్రిమినల్ కేసులలో నేర విచారణ పూర్తి అయిన అనంతరం సదరు కేసులు న్యాయవిచారణకు వచ్చినప్పుడు పోలీస్ ల తరపున తామే ప్రాసిక్యూషన్ నిర్వహిస్తామని పోలీసులు, ప్రాసిక్యూటర్స్ అంటేనే పిపి లు అని సెలవిచ్చారు.
