25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

బీఆర్ఎస్ పార్టీ నాయకుల అరెస్ట్

Must read

📰 Generate e-Paper Clip

 

లింగంపేట్, బతుకమ్మ

 

లింగంపేట మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులను స్థానిక పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. మంగళవారం లింగంపేట మండలంలోని ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటన సందర్భంగా స్థానిక పోలీసులు బీఆర్ఎస్ పార్టీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు. బిఆర్ఎస్ పార్టీకి చెందిన పోల్కంపేట గ్రామ సర్పంచ్ దివిటి రమేష్, భవానిపేట గ్రామ సర్పంచ్ ఆకుల సురేందర్ నాయకులు నర్సింలు, ముదాం సాయిలు కొండ లక్ష్మణ్, నర్సింలు అనిల్ రెడ్డి, సందీప్ తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ మండలంలో అభివృద్ధి పనులు చేస్తుంటే తామ అడ్డుకునే ప్రసక్తి లేదన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులకు కష్టాలు తీర్చాలని డిమాండ్ చేశారు. పంటలు సాగు చేసే రైతులకు అందుబాటులో ఎరువులు ఉంచాలని వారు డిమాండ్ చేశారు. యూరియా పొందడానికి అమల్లోకి తీసుకువచ్చిన యాప్ ద్వారా ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం తాడ్వాయి మండల కేంద్రంలో మంగళవారం ధర్నాకు పిలుపునిస్తే అధికార పార్టీ నాయకులు పోలీసుల సహకారంతో ఆందోళన కార్యక్రమాన్ని అణగదొక్కడానికి ముందస్తుగా అరెస్టులు చేయడం సరికాదన్నారు. అరెస్టులతో ఆందోళనలను ఆపలేరని వెల్లడించారు.

More articles

Latest article