నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని నగరంలోని నాందేవ్ వాడ లో గల స్ప్రింగ్ ఫీల్డ్ స్కూల్లో జిల్లా పోటీలను నిర్వహించడం జరిగింది. ఈ పోటీలు సబ్ జూనియర్, జూనియర్ బాల బాలికలు, సీనియర్ స్త్రీ పురుషుల విభాగంలో నిర్వహించడం జరిగింది. జిల్లాలోని వివిధ విద్యాసంస్థల నుండి దాదాపుగా 150 క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ భాగాలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా క్రీడా అధికారి పవన్ కుమార్ , ప్రముఖ న్యాయవాది రాజ్ కుమార్ సుబేదార్, యోగా గురువు సిద్ధిరాములు, యోగ అసోసియేషన్ అధ్యక్షురాలు కళే ఐశ్వర్య, ఉపాధ్యక్షులు టి. వి. ప్రవీణ్ కుమార్, రజిత, కార్యదర్శి గంగాధర్, కోశాధికారి కమలవాని, అసోసియేషన్ సభ్యులు గాయత్రి, లోహిదాస్, అశోక్, ప్రవీణ్ లు పాల్గొని. విజేతలకు బహుమతులు అందజేశారు.

