29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

సూపర్ బ్రెయిన్ యోగతో ఆందోళనకు చెక్

Must read

📰 Generate e-Paper Clip

 

. . . అంతర్జాతీయ గుంజిళ్ళ ప్రచారకులు అందే జీవన్ రావు

 

నిజామాబాద్ ప్రతినిధి, బతుకమ్మ :

 

నిజ జీవితంలో పని ఒత్తిడి, ఆందోళనకు గురి అవుతున్న తరుణంలో సూపర్ బ్రెయిన్ యోగ (గుంజిళ్ళు ) చేయడం వల్ల ఆందోళనకు చెక్ పెట్టడం సాధ్యమౌతుందని గుంజిళ్ళ మాస్టర్, అంతర్జాతీయ గుంజిళ్ళ ప్రచారకులు అందె జీవన్ రావు అన్నారు. 12 వ అంతర్జాతీయ యోగా వేడుకలను పురస్కరించుకుని తెలంగాణా విశ్వవిద్యాలయంలో శనివారం నిర్వహించిన కార్యక్రమం లో ‘సూపర్ బ్రెయిన్ యోగా’ అంశంపై వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు సూపర్ బ్రెయిన్ యోగా చాలా ఉపయుక్తమైందని, దీని వలన విద్యార్థులలో జ్ఞానము, ఏకాగ్రత, అభ్యసనము, సృజనాత్మకత, సమస్యా పరిష్కారము, మానసిక సమతుల్యత మొదలైనవి పెంపొందూతయ్యన్నారు. సమస్యలు, ఆందోళనల నుండి ఉపశమనం పొందుతారని, బహుళ ప్రయోజనాలున్న సూపర్ బ్రెయిన్ యోగాను విద్యా ప్రణాళికలో భాగంగా రూపొందించడం ద్వారా విద్యార్థుల సమగ్రాభివృద్ధికి తోడ్పడవచ్చునని అన్నారు. సామాన్య ప్రజలు కుడా సూపర్ బ్రెయిన్ యోగను దినచర్యలో భాగంగా ఆచరించి సుఖవంతమైన, ఆనందకరమైన జీవనాన్ని గడపవచ్చునని అన్నారు. కార్పొరేట్ వెల్ నెస్ ప్రోగ్రాం లో భాగంగా చేర్చడం ద్వారా ఉద్యోగులలో ఒత్తిడి తగ్గించి ఉత్పాదకతను పెంపొందించవచ్చునన్నారు . సూపర్ బ్రెయిన్ యోగా పై ప్రదర్శనను నిర్వహించి,  విద్యార్థులు,  సిబ్బంది చే 14 రౌండ్లు సూపర్ బ్రెయిన్  యోగను lచేయించినారు. తాను వివిధ సదస్సులలో సమర్పించిన పరిశోధనా పత్రాల ప్రతులను ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రాంబాబునకు అందేజేసినారు. కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రాంబాబు మాట్లాడుతూ అందె జీవన్ రావు పదవీ విరమణ తర్వాత కూడా విద్యార్థులకు ఉపయుక్తమైన సూపర్ బ్రెయిన్ యోగా అంశంపై దేశంలోని వివిధ రాష్ట్రాలలోనే కాకుండా ఇతర దేశాలలో వర్క్ షాప్ లు నిర్వహించడం అభినందనీయమన్నారు.  ఈ కార్యక్రమం లో జాతీయ సేవా పథకం సమన్యయ కర్త  ప్రొఫెసర్ అపర్ణ బోధనా బోధనేతర సిబ్బంది అందె జీవన్ రావును శాలువాతో ఘనంగా సత్కరించినారు. ఈ కార్యక్రమంలో బోధనా సిబ్బంది ప్రొఫెసర్ హలీం ఖాన్, ఫీజికల్ డైరెక్టర్ నేత తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article