నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు, నిజామాబాద్ తొలి మేయర్ ధర్మపురి సంజయ్‌కు షెర్లింగంపల్లి నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రముఖ నాయకులు శనివారం ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సోహైల్ ఖురేషి, అశ్రఫ్, అబ్దుల్ సత్తార్, శ్రీరాములు, నర్సింహా రెడ్డి, అశోక్, మునీర్, ఖాలేద్ ఖురేషి, అబ్దుల్ సలీమ్, మహ్మద్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు. వారు ధర్మపురి సంజయ్‌కు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సామాజిక సేవా రంగంలో ధర్మపురి సంజయ్ చేస్తున్న కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం, సామాజిక ఐక్యత కోసం ఆయన చేస్తున్న సేవలు ఆదర్శప్రాయమని కొనియాడారు. భవిష్యత్తులో కూడా ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. సన్మానానికి స్పందించిన ధర్మపురి సంజయ్, తనపై చూపిన అభిమానం, గౌరవానికి షెర్లింగంపల్లి నియోజకవర్గ నాయకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సమాజ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని చెప్పారు. స్నేహపూర్వక వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
