. . . కంజర్‌లో జూన్ 23న స్పాట్ కౌన్సిలింగ్
మోపాల్, బతుకమ్మ :
మోపాల్ మండలం కంజర్‌లోని ఎంజేపీ పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మిగిలిన సీట్ల భర్తీ కోసం స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ స్పాట్ అడ్మిషన్లు జూన్ 23, 2026న నిర్వహించనున్నట్లు ఎంజేపీ పాఠశాల ఆర్‌సీవో కె. సత్యనాథ్ రెడ్డి వెల్లడించారు. ఇంటర్మీడియట్ ప్రవేశాలకు గ్రూపుల వారీగా అర్హత మార్కులను నిర్ణయించారు. ఎంపీసీ గ్రూపులో చేరేందుకు పదో తరగతిలో 500 మార్కులు లేదా అంతకంటే ఎక్కువ సాధించిన బాలురు, బాలికలు అర్హులుగా పేర్కొన్నారు. బైపీసీ గ్రూపుకు బాలురకు కనీసం 450 మార్కులు, బాలికలకు 475 మార్కులు సాధించి ఉండాలి. అలాగే సీఈసీ గ్రూపులో ప్రవేశాలకు బాలురు, బాలికలు ఇద్దరూ 450 మార్కులు లేదా అంతకంటే ఎక్కువ సాధించి ఉండాలని తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు ఎస్‌ఎస్‌సీ మార్కుల మెమో ఒరిజినల్‌తో పాటు రెండు జిరాక్స్ ప్రతులు, ఆన్‌లైన్ దరఖాస్తు ఫారం ప్రింట్ తీసుకుని కళాశాలకు హాజరై స్పాట్ అడ్మిషన్ పొందవచ్చని అధికారులు సూచించారు. విద్యార్థులు నిర్ణీత తేదీన అవసరమైన పత్రాలతో హాజరై అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎంజేపీ పాఠశాల అధికారులు కోరారు.
