27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ప్రభుత్వ కళాశాలలో ఉత్తమ బోధన

Must read

📰 Generate e-Paper Clip

 

. . . నోడల్ అధికారి షేక్ సలాం

 

లింగంపేట్, బతుకమ్మ :

 

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అనుభవం గల అధ్యాపకులు ఉన్నారని ఇక్కడ చదివే విద్యార్థులకు ఉత్తమమైన బోధన ఉంటుందని ఇంటర్మీడియట్ జిల్లా నోడల్ అధికారి షేక్ సలాం అన్నారు. శనివారం తాడ్వాయి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలో చదివే విద్యార్థులు అదృష్టవంతులని వారు అన్ని రంగాలలో ఎదిగే విధంగా అధ్యాపకులు కృషి చేస్తారని తెలిపారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడలలో కూడా రాణించాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు.

 

Excellent teaching in the government college.

 

ఈ సంవత్సరం తాడ్వాయి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉత్తమ ఫలితాలు వచ్చాయని అలాగే అడ్మిషన్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపారు. నూతనంగా వచ్చిన ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అధ్యాపకులు చక్కని బోధనతో పాటు సమిష్టిగా కృషి చేస్తూ కళాశాల అభివృద్ధి కోసం అడ్మిషన్ల పెంపు కోసం కృషి చేయడం అభినందనీయమని సలాం తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రావ్ మాట్లాడుతూ అడ్మిషన్ల సంఖ్య మరింత పెంచే విధంగా విద్యార్థులు అధ్యాపకులకు సహకరించాలని సూచించారు. నిరుపేద విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వo ఉపకార వేతనాలు అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రణాళిక బద్దంగా విద్యా బోధన జరుగుతుందని విద్యార్థులు కూడా రెగ్యులర్ గా కళాశాలకు వచ్చి ఉత్తమ విద్యార్థులుగా రాణించి తల్లి తండ్రుల కలలు నిజం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల  సీనియర్ అద్యాపకులు సంతోష్, వీరేశం, మల్లేశం, శ్రీకాంత్, సతీష్ చంద్ర, శ్రీనివాస్, సరస్వతి, మనీష, శ్రీకాంత్, హారిక కళాశాల సిబ్బంది నర్సయ్య, సోటేరియా, లక్ష్మి, శ్రీనివాస్ పాల్గొన్నారు.

 

Excellent teaching in the government college.

More articles

Latest article