30.9 C
Hyderabad
Monday, August 3, 2026

త్వరలో నిజామాబాద్ లో సర్ పై బిఆర్ఎస్ సమావేశం నిర్వహణకు కేటిఆర్ ఆదేశాలు

Must read

📰 Generate e-Paper Clip

 

… కేటిఆర్ కు స్వాగతం పలికిన బిఆర్ఎస్ నాయకులు

 ఇందల్వాయి, బతుకమ్మ:

అదిలాబాద్ పర్యటనకు వెళుతున్న  బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావుకు నిజామాబాద్ జిల్లా సరిహద్దులో ఘన స్వాగతం పలికారు కారు పార్టీ నేతలు. శనివారం ఆదిలాబాద్ పర్యటనకు వెళుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కే. తారక రామారావు ( కేటిఆర్) కు ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ మంత్రి, బాల్కోండ శాసన సభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి, అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల లు పుష్పగుచ్చాలు అందచేసి స్వాగతం పలికారు.

KTR directs officials to organize a BRS meeting in Nizamabad soon. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో రాజకీయ పరిస్థితులను గురించి చర్చించారు. నిజామాబాద్ జిల్లాలో త్వరలో నిర్వహించే బిఎల్ఓ లో సమావేశపు తేదీలను ఖరారు చేసేందుకు నిర్ణయించారు. త్వరగా సర్ పై బిఎల్ఓ సమావేశం నిర్వహించాలని బిఆర్ఎస్ నాయకులకు కేటిఆర్ సూచించారు. ఈ కార్యక్రమంలో  మాజీ మేయర్ దండు నీతూ కిరణ్, మాజీ జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, నవీద్ ఇక్బాల్ తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

KTR directs officials to organize a BRS meeting in Nizamabad soon

More articles

Latest article