… కేటిఆర్ కు స్వాగతం పలికిన బిఆర్ఎస్ నాయకులు
ఇందల్వాయి, బతుకమ్మ:
అదిలాబాద్ పర్యటనకు వెళుతున్న బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావుకు నిజామాబాద్ జిల్లా సరిహద్దులో ఘన స్వాగతం పలికారు కారు పార్టీ నేతలు. శనివారం ఆదిలాబాద్ పర్యటనకు వెళుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు ( కేటిఆర్) కు ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ మంత్రి, బాల్కోండ శాసన సభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి, అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల లు పుష్పగుచ్చాలు అందచేసి స్వాగతం పలికారు.
. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో రాజకీయ పరిస్థితులను గురించి చర్చించారు. నిజామాబాద్ జిల్లాలో త్వరలో నిర్వహించే బిఎల్ఓ లో సమావేశపు తేదీలను ఖరారు చేసేందుకు నిర్ణయించారు. త్వరగా సర్ పై బిఎల్ఓ సమావేశం నిర్వహించాలని బిఆర్ఎస్ నాయకులకు కేటిఆర్ సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ దండు నీతూ కిరణ్, మాజీ జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, నవీద్ ఇక్బాల్ తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
