27.3 C
Hyderabad
Friday, July 31, 2026

విద్యార్థికి ఆర్థిక సహాయం అందజేత

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, ఆర్మూర్ :  ఆర్మూర్ పట్టణానికి చెందిన పి.శశాంక్ బిబిఏ చదువు కోసం ఈరవత్రి రాందాస్ ఫౌండేషన్ చైర్మన్, చార్టెడ్ అకౌంటెంట్ ఈరవత్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో రూ. 20 వేలను అందజేశారు. ఆర్మూర్ లోని సిఏ రాజశేఖర్ కార్యాలయంలో శుక్రవారం డబ్బులను అందజేశారు. ఆర్మూర్ కు చెందిన శశాంక్ హైదరాబాద్ లోని ఐ క్రియేట్ కళాశాలలో బిబిఏ ఫైనలియర్ చదువుతున్నారు. ఆర్థిక పరిస్థితి బాగాలేక చదువు మధ్యలో మానేసే పరిస్థితి వచ్చిందని తెలుసుకొని ఈరవత్రి రాందాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం చేయడానికి ముందుకొచ్చారు. ఈ సందర్భంగా చైర్మన్ రాజశేఖర్ మాట్లాడుతూ విద్యార్థి శశాంక్ చదువు మధ్యలో నిలిచిపోకుండా ఉండడం కోసం తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేసినట్లు తెలిపారు. రాబోయే రోజులలో మరిన్ని కార్యక్రమాలు చేస్తామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు సడాక్ ప్రమోద్, బదాం రాజ్ కుమార్, సిరిగిరి జీవన్, ఈరవత్రి సురేందర్, హజారి సతీష్, దాసరి గోపికృష్ణ, ప్రవీణ్, సాయి, సౌమ్య పాల్గొన్నారు.

More articles

Latest article