విద్యార్థికి ఆర్థిక సహాయం అందజేత

బతుకమ్మ, ఆర్మూర్ :  ఆర్మూర్ పట్టణానికి చెందిన పి.శశాంక్ బిబిఏ చదువు కోసం ఈరవత్రి రాందాస్ ఫౌండేషన్ చైర్మన్, చార్టెడ్ అకౌంటెంట్ ఈరవత్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో రూ. 20 వేలను అందజేశారు. ఆర్మూర్ లోని సిఏ రాజశేఖర్ కార్యాలయంలో శుక్రవారం డబ్బులను అందజేశారు. ఆర్మూర్ కు చెందిన శశాంక్ హైదరాబాద్ లోని ఐ క్రియేట్ కళాశాలలో బిబిఏ ఫైనలియర్ చదువుతున్నారు. ఆర్థిక పరిస్థితి బాగాలేక చదువు మధ్యలో మానేసే పరిస్థితి వచ్చిందని తెలుసుకొని ఈరవత్రి రాందాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం చేయడానికి ముందుకొచ్చారు....