31.9 C
Hyderabad

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల హక్కుపత్రాలు అందజేత

Must read

📰 Generate e-Paper Clip

బాన్సువాడ, బతుకమ్మ : బీర్కూరు మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన లబ్ధిదారులకు ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల హక్కు పత్రాలను అందజేశారు. గ్రామానికి చెందిన 38 మందికి శుక్రవారం తన క్యాంప్ కార్యాలయంలో ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజుతో కలిసి పత్రాలు పంపిణీ చేశారు. సబ్ కలెక్టర్ కిరణ్మయి, మున్సిపల్ ఛైర్మన్ జంగం గంగాధర్, బీర్కూర్ తహసీల్దార్ లత, బోయిని శంకర్, మాజీ ఎంపీపీ తిలకేశ్వరి రఘు, మియాపూర్ శశి, యామ రాములు, కొరిమె రఘు పాల్గొన్నారు.

 

More articles

Latest article